Header Banner

మాకు పని భద్రత కల్పించాలి.. లోకేష్‌కు ఆశా వర్కర్ల విన్నపం.! ఆ హామీని అమలు..

  Sat Feb 15, 2025 14:12        Politics

మంత్రి నారా లోకేష్‌ను ఆశావర్కర్లు ఇవాళ(శనివారం) విశాఖపట్నంలో కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్లు నారా లోకేష్‌కు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను నారా లోకేష్ పరిష్కరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. తమను విధుల నుంచి తొలగించకుండా కొనసాగిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు.. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్పొరేటర్లు తమను విధుల నుంచి తొలగించాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ కండువా వేసుకుని ఆశావర్కర్లు ఆ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. అప్పటి పీడీ బాపూనాయడు ఒత్తిడితోనే తాము వైసీపీ సమావేశంలో పాల్గొన్నామని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీ అనుచరుల కోసం ముమ్మర గాలింపు! కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్!

 

పీడీ బాపూనాయడు మొత్తం యుసీడీని వైసీపీ పార్టీ యంత్రంగా మార్చారని ఆరోపించారు. తమను రాజకీయాల్లోకి లాగొద్దని.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని, 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యూలర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెప్మా, ఆర్పీల వ్యక్తిగత అకౌంట్లోకి వేతనం జమ అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జీవీఎంసీ పరిధిలో ఆర్పీలుగా తాము విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తాము ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నామని అన్నారు. పేద మహిళలకు డ్వాక్రా గ్రూపులు పెట్టి, బ్యాంకు లోన్లు ఇప్పించడమే కాకుండా ప్రభుత్వం చేపట్టే ప్రభుత్వ పథకాలకు ప్రచారం, ప్రభుత్వ సమావేశాలకు మహిళలను సమీకరించడం వంటి చాలా పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తమకు ఇ చ్చే జీతాలను తమ వ్యక్తిగత ఖాతాల్లో వేయాలని ఎన్నికల సమయంలో చంద్రబాబుకు తెలిపామని గుర్తుచేశారు. ఆశావర్కర్లకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీని అమలు చేయాలని కోరారు. అలాగే 3సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, తమ మీద పని ఒత్తిడిని తగ్గించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తమపై రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని, పని భద్రత కల్పించాలని ఆశావర్కర్లు కోరారు.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #LokeshSpeech #jagan #comments #viralvideo #lokeshmeeting #ycp #tdp